జగన్ ఓదార్పులో సోనియా ఫోటో ఎందుకు పెట్టరు?: దామోదర్ రెడ్డి

తెలంగాణకు వ్యతిరేకి ఆయిన వైయస్ ఫోటోను తెలంగాణ కోసం అమరులైన వారి సంస్మరణ సభలో పెట్టమని డిమాండ్ చేయటం విడ్డూరమన్నారు. గిరిజనులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిడబ్లూసి సభ్యుడైన కె కేశవరావును విమర్శిస్తే సోనియాగాంధీని అవమానపరిచినట్టేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యింది సోనియాగాంధీ దయవల్లనే అని అన్నారు. సోనియాగాంధీ వైయస్ పై దయచూపించకుంటే వైయస్ అంతటి వాడయ్యేవాడా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications