హోంమంత్రి ఇంటి ముట్టడికి ఓయు జెఏసి యత్నం: అరెస్టు, ఉద్రిక్తత

పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి విద్యార్థులను అదుపు చేశారు. సబితారెడ్డి ఇంటిని ముట్టడించే చర్యలను అడ్డుకొన్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య కొంత పెనుగులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.అయితే డిసెంబర్లో నిర్వహించే ఎస్ఐ పరీక్షలు ప్రభుత్వం యథాతథంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటపై ఉస్మానియా ఐకాస ధ్వజమెత్తింది. హైదరాబాద్ కు గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతుందన్నారు. కాగా మంగళవారం ఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు నిరసనగా విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చిన ఉస్మానియా ఐకాస పిలుపు మేరకు తెలంగాణలోని కళాశాలలన్నీ బందును పాటించాయి.


Click it and Unblock the Notifications