ఒయు విద్యార్థుల ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

కాగా ఉస్మానియా విద్యార్థులు రాత పరీక్షలు నిరసిస్తూ విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం తెలంగాణ వారికి అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు పదవి కోసం మాట్లాడటం లేదన్నారు. సిగ్గులేని మంత్రులు వెంటనే రాజీనామా చేస్తే మేం మిమ్మలను గెలిపించుకుంటామన్నారు. ఫ్రీజోన్ విషయం తేలేవరకు పరీక్షలు నిర్వహించనివ్వమని హెచ్చరించారు. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు. అంతకుముందు ఎస్ఐ అభ్యర్థులు, విద్యార్థులు హోంమంత్రి సబితారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications