స్పీకర్ కు వివరణ ఇచ్చిన తెదేపా అసమ్మతి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్

ప్రసన్నకుమార్ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని విమర్శిస్తున్నారు. చంద్రబాబులో మార్పు కోరుకుంటున్నానంటు ప్రకటనలు చేశాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. టిడిపి కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకోవటం లేదు. టిడిపి శాసనసభ్యుడుగా ఉంటూ టిడిపికి, బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనపై టిడిపి సభాపతికి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ ప్రసన్నకుమార్ కు నోటిసులు పంపారు.
కాగా ప్రసన్నకుమార్ టిడిపికి దూరమవుతూనే క్రమంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రలో జగన్ తో పాటు పాల్గొన్నాడు. తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించటం జగన్ మంచితనానికి నిదర్శమని, ఆయన బాటలో నడుస్తానని చెప్పాడు. జిల్లాలో జరిగిన ఓదార్పు ముగింపు యాత్రలో కూడా ఆయన లక్ష్మీపార్వతి, రోజా తదితరులతో కలిసి పాల్గొన్నాడు.












Click it and Unblock the Notifications