అరెస్టు అబద్దం: మీడియాపై వరవరరావు అసంతృప్తి

Varavara Rao
హైదరాబాద్: తమను పోలీసులు అరెస్టు చేశారంటూ ఓ టీవీ ఛానల్లో అసత్య వార్తలు ప్రసారమయ్యాయని విరసం నేత వరవరరావు, కళ్యాణరావులు అన్నారు. చాలామంది పోలీసులు మోహరించి మమ్మల్లి చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన వార్తలు శుద్ధ అబద్దమని వారు స్పష్టం చేసారు. ఇలాంటి అబద్దపు వార్తలు కొన్ని ఛానళ్లు ఎందుకు ప్రసారం చేస్తాయో అర్థం కాదని వారు ఆవేదన చెందారు. జైల్లో ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష్ అలియాస్ పద్మను చూడడానికి వెళ్లిన వరవరరావు, కళ్యాణ్ రావులను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

కళ్యాణరావు, అన్నపూర్ణలు ఒరిస్సా, ఆంధ్ర బార్డర్ లోని కోరాకోట్ కు వెళ్లారని వరవరరావు తెలిపారు. తాను ఇంట్లోనే ఉన్నానన్నారు. అయినా తమను పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు రావడమేమిటన్నారు. బాధ్యతగా ఉండవలసిన మీడియానే ఇలాంటి అబద్దపు వార్తలు ప్రచారం చేస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ఆర్కెను తాను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కూడా ఓ ఛానల్లో అబద్దపు ప్రచారం ప్రసారమయ్యిందని ఆయన ఆవేదన చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+