తెలంగాణలో వైయస్ జగన్ క్యాంప్ వ్యూహం ఏమిటి?

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంతంలోని నాయకులు మెల్లగా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వైయస్ జగన్ పర్యటనకు మార్గం సుగమం చేసుకోవడానికి మెల్లగా వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డికి మధ్య భువనగిరి వేదికపై గొడవ జరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఇంటా దివంగత నేత వైయస్సార్ అభిమానులు ఉన్నారనే నినాదంతో వారు మెల్లగా వైయస్ జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడానికి వీలైన పరిస్థితులను కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసులోని వైయస్ వ్యతిరేకులే వైయస్ జగన్ యాత్రకు ఆటంకంగా మారారనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ, పార్టీ సభలో వైయస్ అభిమానుల చేత గొడవ చేయించడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్లు కనిపిస్తోంది.

గుంటూరులో నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి ప్రకటనను చూసినా ఆ విషయం తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో వైయస్ అభిమానులున్నారని, వైయస్ వ్యతిరేకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణపై మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. వ్యూహాత్మకంగానే ఆయన అలా అన్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణను తాము వ్యతిరేకించడం లేదంటూ తమ ద్వారా వైయస్ జగన్ ను తెలంగాణలో అడుగు పెట్టించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. క్రమక్రమంగా వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు తెలంగాణలో కోమటి రెడ్డి మాదిరిగానే ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వైయస్ వ్యతిరేకులను గట్టిగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నట్లు చెప్పవచ్చు.

తెలంగాణకు చెందిన నాయకులే కాకుండా సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా తెలంగాణలో వైయస్ అభిమానులున్నారని పదే పదే వాదిస్తున్నారు. తెలంగాణలో ఇంటింటా వైయస్ బొమ్మలున్నాయని అంటున్నారు. ఈ వాదనకు మరింత ప్రచారం కల్పించడం ద్వారా వైయస్ జగన్ కు వ్యతిరేకతను తగ్గించాలని చూస్తున్నారు. ప్రజలు జగన్ ను వ్యతిరేకించడం లేదని, కాంగ్రెసులోని వైయస్ వ్యతిరేకులే అడ్డు తగులుతున్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ వాదనను మరింత బలంగా ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+