వైయస్ జగన్ ను సిఎం చేయాలంటూ రోశయ్య వేదిక వద్ద ధర్నా

YS Jagan
విజయవాడ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుచరులు మంగళవారం సాయంత్రం విజయవాడలో కాంగ్రెసు 125 ఏళ్ల వేడుకల వేదిక వద్ద ధర్నాకు దిగారు. ఈ సభలో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. డి. శ్రీనివాస్ ప్రసంగిస్తుండగా 200 నుంచి 300 మంది దాకా సభా స్థలికి చేరుకుని వైయస్ జగన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రిగా రోశయ్య రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు.

వైయస్ జగన్ అనుచరులు సభాస్థలి ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రసంగిస్తుండగా వారు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. వారి ఆకస్మిక ప్రవేశంతో సభా స్థలి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+