ఉధృతమవుతున్న ఫ్రీజోన్ ఆందోళన, డిఎస్ ఇల్లు ముట్టడి

రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయటం గర్హనీయమని, వారిని వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు రాత పరీక్షను రద్దు చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. డిఎస్ రాత పరీక్ష వాయిదాకు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే డిఎస్ ను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.
కాగా రాత పరీక్షను వాయిదా వేయాలంటూ ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం నుండి తెలంగాణలోని పది జిల్లాల్లో నిరంతర ఆందోళనలు నిర్వహిస్తామని ఏబివిపి నాయకుడు కడియం రాజు ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. రాత పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణ వారు అన్యాయమై పోతారన్నారు. ఫ్రీజోన్ అంశం తేలేవరకు దానిని వాయిదా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications