అవినీతికి కాంగ్రెసు చిరునామాగా మారింది: చంద్రబాబు ధ్వజం

జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను సుప్రీంకోర్టు తప్పు పట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని ఆ కుంభకోణంపై ఇంత కాలం ఎందుకు మౌనం వహించారని ఆయన అడిగారు. అవినీతిపరులను ప్రధాని ప్రమోట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు ఏ ప్రధానిపై కూడా చేయని వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెసు తప్ప దేశానికి గతి లేదని అంటున్న వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీరును కూడా ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications