లగడపాటికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు: జీవన్ రెడ్డి

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సగానికంటే ఎక్కువ పోస్టులు తెలంగాణకే కేటాయిస్తున్నారనటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. లగడపాటి వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టు ఉందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉన్న లౌక్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఎస్ఐ పోస్టుల భర్తీని ఆపుతారా లేదంటే తెలంగాణకు అన్యాయం చేసేందుకు సిద్ధమని చెప్పి రాత పరీక్షలను కొనసాగించండి. అప్పుడు మా సత్తా మేం చూపుతామంటూ ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications