Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోంమంత్రి రాజీనామా చేయాలి: ఓయు విద్యార్థుల డిమాండ్

Osmania University
హైదరాబాద్: హైదరాబాదు ఫ్రీజోన్ విషయం తేలే వరకు ఎస్ఐ పరీక్షలు రద్దు చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సామూహిక నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. సుమారు 2వేల మంది ఇందుకు తయారయ్యారు. ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ సందర్భాంగా వారు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఏబివిపి విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తార్నాకవైపు ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. దీంతో తార్నాకలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

హోంమంత్రి సబితారెడ్డి సీమాంధ్ర నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ వారికి న్యాయం చేయలేని సబితారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం మంత్రి సబితారెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని వారు చెప్పారు. 15 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ వారికి అడిగే హక్కు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నదన్నారు. లాఠీలు, తుపాకీలు మాకు కొత్తకాదని, మేం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఎంతమంది మరణించినా వెనక్కి తగ్గేది లేదన్నారు.

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, డిజిపి అరవిందరావు హైదరాబాదును ఫ్రీజోన్ గా ఉంచాలని కుట్ర పన్నుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సపోర్టు చేయకుంటే వారి ఇళ్లముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులకు చీము నెత్తురు ఉంటే వెంటనే సీమాంధ్రులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తెలంగాణకు అన్యాయం చేస్తున్న డిజిపిని బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిజిపి చిచ్చుపెడుతున్నాడన్నారు. రోశయ్య ముఖ్యమంత్రా లేక రోబోనా అని అడిగారు. పోలవరంపై తదితర విషయాలపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే ప్రభుత్వం ఈ విషయంపై సైతం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి వెనుక ఉండి భజన చేస్తున్న మంత్రులు రాజీనామా చేయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+