జగన్ ను సిఎం చేయాలనేది అధిష్టానంపై ఆధారపడి ఉంది: టిజి

గొడవల్లో రాజకీయ నాయకులు పాల్గొనడం లేదని, విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారని, దీంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇవన్నీ చూసిన తర్వాతనే కమిటీ ఏర్పాటు జరిగిందని ఆయన అన్నారు. కొత్త తరం వస్తే తెలుగుదేశం పార్టీ విస్తరించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ఇదే విధంగా అమలు చేస్తూ పోతే నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications