హైదరాబాదులో ఆందోళనలు: అయినా వెనక్కి తగ్గని సంస్థలు

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ గత కొంత కాలంగా ఆందోళనలతో అట్టుడికిపోతోంది. దీనివల్ల హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రారనే విమర్శ వచ్చింది. అయితే, ఆ విమర్శను తోసిరాజంటూ హైదరాబాదుకు వరుసగా బడా పారిశ్రామిక సంస్థల పెట్టుబడులు, వాటి యూనిట్లు వస్తున్నాయి. టాటా, హీరో హోండా ఇప్పటికే హైదరాబాదులో తమ యూనిట్లను ప్రారంభించడానికి ఇదివరకే ముందుకు వచ్చాయి. తాజాగా గూగుల్ కూడా ముందుకు వస్తోంది. గూగుల్ హైదరాబాదులో షాప్ ను ఏర్పాటు చేయబోతోంది.

యాడ్ వర్డ్స్ కార్యకలపాలు సాగించడానికి గూగుల్ హైదరాబాదులో ఓ కాల్ సెంటర్ పెట్టబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల్లో యాడ్ వర్డ్స్ పై ఆసక్తి ఉన్నవారికి సపోర్టు చేసేందుకు గూగుల్ ఈ కాల్ సెంటర్ ను పెట్టాలని నిర్ణయించింది. గత ఏడాది కాలంగా హైదరాబాదులో ఆందోళనలు చెలరేగుతున్నప్పటికీ మరిన్ని సంస్థలు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆందోళనలు తాత్కాలికంగా మాత్రమే బ్రేకులు వేస్తాయని, అది శాశ్వతం కాదని పారిశ్రామికవేత్తలు భావించడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం క్రమంగా తొలుగుతుండడంతో మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+