అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
State
oi-Pratapreddy
By Pratap
చిత్తూరు: అమెరికాలోని సాల్ట్‌లేక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం చారాలకు చెందిన విజయభాస్కర్ రెడ్డి(29) మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. న్యూజెర్సీలోని ఎడిసెన్ లో ఈఎం-టీం కార్పొరేషన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి ఆర్గాన్ కు కారులో వెళ్తుండగా వెనుక వైపు నుంచి టెంపో ఢీకొంది. విజయభాస్కరరెడ్డి తండ్రి నరసింహారెడ్డి భారత సైన్యంలో పనిచేస్తూ పదేళ్ల కిందట పదవీ విరమణ చేశారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.