ప్రీజోన్ కొరవితో రోశయ్య తల గోక్కుంటున్నారు: చంద్రబాబు

Chandrababu Naidu
విశాఖపట్నం: ఫ్రీజోన్ వివాదం విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం కొరవితో తల గోక్కుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన శుక్రవారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీఛార్జి చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఫ్రీజోన్‌ అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందని, సమయానుసారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంఘటనను ఆయన ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణ అని ఆయన అన్నారు. ప్రభుత్వం తీరు వివాదాస్పదంగా ఉందని ఆయన అన్నారు.

సమస్యలు వస్తే పరిష్కరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని, ఏ సమస్యలను కూడా ముఖ్యమంత్రి పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని ఆయన అన్నారు. ఇంత కుంభకోణం ఇప్పటి వరకు జరగలేదని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకు తింటోందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+