హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యా! ఖాళీ ప్రాజెక్టుల్లో దూకి చద్దాం: కాంగ్రెసు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య హుస్సేన్ సాగర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి అలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమంటున్నారు. శుక్రవారం సచివాలయం దగ్గర కాంగ్రెసు సీనియర్ నాయకుడు దామోదరరెడ్డి, ఆమోస్ మాట్లాడారు. విద్యార్థులపట్ల ప్రభుత్వం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని దామోదరరెడ్డి ధ్వజమెత్తారు. రోశయ్యది అసమర్థ ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి అనుభవం గల వ్యక్తులని ఆలాంటి వారు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఖాళీగానే ఉన్నాయని నాయకులమందరం కలిసి అందులో దూకి చస్తే పీడ విరగడవుతుందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వ్యంగ్యంగా మాట్లాడటం పద్ధతికాదన్నారు. అలా మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాలన్నారు.

ప్రభుత్వం వెంటనే 14ఎఫ్ పేరాను తొలగింపుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులను వెంటనే సస్పెండు చేయాలని డిమాండు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు రెచ్చగొడుతున్నారన్నారు. 31న తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ అనుకూలంగా నివేదిక ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే కొందరు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతన్నారన్నారు. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆగారు. మరో రెండునెలలు ఆగితే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నించారు. హుసేన్ సాగర్ నిరుద్యోగుల కోసం ఉందా అన్నారు. ఈ సున్నితమైన అంశం అధిష్టానం దృష్టికి తీసుకొని వెళతామన్నారు.

పోలీసులు వెంటనే విశ్వవిద్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని మరో నాయకుడు ఆమోస్ డిమాండ్ చేశారు. ఎలాంటి అరాచకాలు చేయమని హామీ ఇస్తేనే పోలీసులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి హుసేన్ సాగర్లో దూకమనడం చాలా అభ్యంతరకరమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X