దిగొచ్చిన సబితా ఇంద్రారెడ్డి: ఎస్సై పోస్టుల రాత పరీక్షలు వాయిదా

రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ వెంటనే చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. రోశయ్య కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ రాశారని ఆమె చెప్పారు. రోశయ్య చిదంబరంతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వివాదాన్ని పరిష్కరించడానికి, కేంద్రం తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఓ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తోందని ఆమె చెప్పారు. రెండేళ్లుగా పరీక్షకు అభ్యర్థులు తయారవుతున్నారని, ఒక రాత పరీక్ష పూర్తి అయితే సరిపోతుందనే ఉద్దేశంతో రాతపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆమె వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల్లో ఉత్సాహం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications