తెలంగాణ లాయర్ల ధర్నా ఇష్యూ: కెసిఆర్, విజయశాంతిలపై సుప్రీంలో పిల్

Jayaprakash Narayana
న్యూఢిల్లీ: గత సెప్టెంబరు 13వ తేది నుండి 16వ తేది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు ధర్నా, ఆందోళనలు చేసి కోర్టు ప్రొసీడింగ్సును అడ్డుకున్నారని సుప్రీంకోర్టులో ఎ.జయప్రకాశ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. బార్ అసోసియేషన్ ఇంత పెద్ద ఆందోళన జరుగుతున్న పట్టించుకోలేదని ఆ పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయన బార్ అసోసియేషన్, లాయర్లతో పాటు రాజకీయనాయకులను తప్పుబట్టాడు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు, మెదక్ పార్లమెంటు సభ్యుడు విజయశాంతి, టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, బార్ అసోసియేషన్, దీక్ష చేపట్టిన న్యాయవాదులు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని జయప్రకాశ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ పై స్పందించింది. సెప్టెంబర్ 13 నుండి 16 వరకు హైకోర్టులో ఏం జరిగిందో మూడువారాల్లో వివరాలు అందజేయాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+