రణరంగంగా మారుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం

కాగా గురువారం విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా రబ్బరు బుల్లెట్లతో విద్యార్థులను కాల్చటం వలన 18 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇది ప్రభుత్వం, పోలీసుల తెలంగాణ వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. విద్యార్థులు చదువుతున్న విద్యాలయంలో పోలీసులను మోహరించాల్సిన అవసరమేమిటని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది పోలీసులను దించినా, లాఠీఛార్జీలు చేసినా, తుపాకీతో పేల్చినా ఫ్రీజోన్ అంశం తేల్చే వరకు ఎస్ఐ రాత పరీక్షలు రద్దు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా గురువారం ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు నిరసనగా తెలంగాణలోని పది జిల్లాల్లో స్వచ్ఛందంగా విద్యాసంస్థలు కళాశాలలు, పాఠశాలలను బందు చేశాయి. పలుచోట్ల విద్యార్థులు ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications