కాంగ్రెసు వైపు పోతుల సురేష్: పరిటాల సునీత కలవరం

Pothula Suresh
హైదరాబాద్: దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ కాంగ్రెసులో చేరడానికి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరో ముఖ్య అనుచరుడు చమన్ కూడా కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వ్యక్తిగతంగా తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీతకు, పార్టీ పరంగా తెలుగుదేశానికి అనంతపురం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత కలవరం చెందుతున్నారు. పోతుల సురేష్, చమన్ పరిటాల రవికి కుడి, ఎడమ భుజాలుగా ఉంటూ వచ్చారు. పరిటాల రవి హత్య తర్వాత వారిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోతుల సురేష్ ను ఇటీవల పోలీసులు సూరత్ లో అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నారు. చమన్ కూడా త్వరలో పోలీసులకు లొంగిపోవచ్చునని ప్రచారం జరుగుతోంది.

పోతుల సురేష్ ను, చమన్ ను కాంగ్రెసులో చేర్పించడానికి వారి సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన పరిటాల సునీత పోతుల సురేష్ ను జైలులో కలవడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెసులోకి వెళ్లవద్దని ఆమె పోతుల సురేష్ ను కోరే అవకాశం ఉంది. ఇటీవల పోతుల సురేష్ భార్య పోతుల సునీత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని, తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమె చంద్రబాబుతో చెప్పుకున్నారు. అయితే, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ స్థితిలో ప్రాణాలను కాపాడుకోవడానికి, ఇతరత్రా కారణాల రీత్యా పోతుల సురేష్ కాంగ్రెసులో చేరాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+