ఎస్సై పోస్టుల పరీక్షపై చెల్లని రోశయ్య మాట: కేంద్రానిదే నిర్ణయం

పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అనూహ్యంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిజానికి, పరీక్షను వాయిదా వేస్తారని ఎవరూ అనుకోలేదు. ఎంతగా వ్యతిరేకత ఎదురైనా ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పట్టుబట్టి నిర్వహించింది. ఎస్సై పరీక్షను వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలుస్తోంది. శాంతిభద్రతల దృష్ట్యా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దీన్నిబట్టి కేంద్రం నుంచి నేరుగా పరీక్షను వాయిదా వేయాలనే నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సబితా ఇంద్రారెడ్డి పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేశారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications