సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న తెలంగాణవాదులు, లాఠీఛార్జి

తెలంగాణకు చెందిన మంత్రి సబితారెడ్డి ఉండగానే ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మంత్రి సావధానంగా ఆయన మాటలు వినటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డిజిపి అరవిందరావు కావాలనే ఉద్యామాన్ని అణిచివేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. రోశయ్య వికక్షణా రహితంగా మాట్లాడుతున్నారన్నారు. హోంమంత్రిగా ఉన్న సబితారెడ్డి తెలంగాణ విద్యార్థులపైనే లాఠీఛార్జి జరుగుతున్నప్పటికీ స్పందించటం లేదన్నారు.
కాగా హోంమంత్రిని అడ్డుకున్న సంఘటన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు హోంమంత్రిని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. వారని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి పర్యటన ఉద్రిక్తంగా తయారయింది.












Click it and Unblock the Notifications