కాంగ్రెసు పార్టీ మదర్ ఆఫ్ కరప్షన్: టిడిపి నేత ఎర్రంనాయుడు

మాజీ ప్రధానమంత్రులు ఆటల్ బిహారీ వాజపేయి, దేవేగౌడ తదితరుల హయాంలో జరగని కుంభకోణాలు కాంగ్రెసు హయాంలోనే జరుగుతాయి. జనతాపార్టీ, ఎన్డీయే పార్టీల హయాంలో ఎలాంటివి జరగలేదన్నారు. రాజీవ్ హయాంనుండి నేటి వరకు కాంగ్రెసు అంతా కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్నరు. అప్పటి బోఫోర్సు కుంభకోణమే భారీది అనుకుంటే అంతకు కొన్ని లక్షల రెట్ల కుంభకోణం రాజా చేశారని ధ్వజమెత్తారు. కార్గిల్ వీరులకు కేటాయిందిన స్థలంలో కాంగ్రెసు నాయకులు తమకు స్థలాలు కేటాయించుకోవటానికన్నా దారుణం లేదన్నారు. ఆదర్శ్ కుంభకోణంతో నిరాశలో ఉన్న దేశాన్ని రాజా కుంభకోణం మరింత ఆశ్చర్యపరిచిందన్నారు. కామన్వెల్తులో 8వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కామన్వెల్తు కుంభకోణంవల్ల దేశ ప్రతిష్టనే దెబ్బతిన్నదన్నారు.












Click it and Unblock the Notifications