మారని వైయస్ జగన్ వైఖరి: ముఖ్యమంత్రి రోశయ్యపై పోరే

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య పాలనపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైఖరి ఏ మాత్రం మారలేదు. సమయం చూసుకుని రోశయ్య ప్రభుత్వంపై దాడి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రోశయ్యను అసమర్థ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి ఏ మాత్రం ఆయన వెనకాడడం లేదు. తాజాగా శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఓ వార్తాకథనమే అందుకు నిదర్శనం. సమ్మె కట్టిన శ్రామికులారా... సర్కారు బజ్జుంది..శీర్షిక కింద రోశయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి డైలీ ఈ వార్తాకథనాన్ని ప్రచురించింది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు, నిరాహార దీక్షలు సాగుతున్నాయని వ్యాఖ్యానించింది. రోశయ్య ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చాటి చెప్పింది. రోశయ్య బొక్క బోర్లా మోకాళ్లపై పడుకుని చూస్తున్నట్లు ఓ కేరిచకర్ ను దానికి సమర్థనగా ప్రచురించింది.

సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు ఆందోళన చేస్తున్నాయని, ప్రభుత్వం నిద్రలో జోగుతోందని, వాయిదాలతో కాలయాపన చేస్తోందని, అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి రాజకుంటోందని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నాలుగు నెలలుగా ఉద్యమం చేస్తున్నారని, 104 సిబ్బంది ఈ నెల 10వ తేదీ నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారని, బీడీ కార్మికులు 18 రోజులుగా ఆందోళనలు సాగిస్తున్నారని చెబుతూ వారి డిమాండ్లను క్రోడీకరించింది. తాజా పరిస్థితిని వివరించింది. రైతులు ప్రభుత్వంపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించింది. గిట్టుబాటు ధర లేదంటూ వేలాది మంది రైతులు మార్కెట్లను, గిడ్డంగులను ముట్టడిస్తున్నారని తెలిపింది. సమస్యలపై మీడియా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలే సమాధానంగా చెబుతున్నారని సాక్షి వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+