తెరపైకి వైయస్ జగన్ విద్యార్థి సేన: సీమాంధ్ర ఆందోళనలో పాత్ర

YS Jagan
గుంటూరు: కొత్తగా వైయస్ జగన్ విద్యార్థి సేన తెర మీదికి వచ్చింది. ఎస్సై రాత పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో అందుకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అది తన ఉనికిని చాటుకుంటుంది. దీంతో వైయస్ జగన్ తెలంగాణ వైఖరి మరోసారి బయట పడిందని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంద్రకు కట్టుబడి కట్టుబడి ఉన్నాడా అంటే అవుననే చెప్పవచ్చు. గతంలో పార్లమెంటులో సమైక్యాంధ్ర ఫ్లకార్డును జగనే స్వయంగా ప్రదర్శించాడు. ప్రస్తుతం వైయస్ జగన్ విద్యార్థి సేన కార్యకలాపాలతో తెలంగాణ ప్రజలు ఆయన వైఖరిని ప్రశ్నించే అవకాశం ఏర్పడింది.

తాజాగా ఎస్ఐ రాత పరీక్షల వాయిదా కారణంగా గుంటూరులో జగన్ విద్యార్థి సేన శనివారం గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం బందుకు పిలుపునిచ్చింది. ఎన్ హెచ్ 9 వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. దీంతో జగన్ సమైక్యాంద్రకే కట్టుబడి ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. హోంమంత్రి సబితారెడ్డి ఎస్ఐ పరీక్షలు వాయిదా వేయటంతో సీమాంధ్రలో అగ్గి రాజుకుంది. అన్ని పార్టీలు, సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీలు, సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎస్ఐ రాత పరీక్ష వాయిదా ఉద్యామానికి మద్దతు పలికాయి. కాని జగన్ వర్గం మాత్రం బయటికి రాలేదు. కాని అదే సీమాంధ్రలో వెంటనే జిల్లా బందుకు పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+