వైయస్ జగన్ సాక్షిపై మంత్రి బొత్స సత్యనారాయణ పైర్

ఆధారాలు లేకుండా సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ఇచ్చినందుకు సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏవో రాజకీయ ప్రయోజనాలు పెట్టుకుని సోనియాను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వెంటనే సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బ తింటే సహించబోమని మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్సై రాత పరీక్షల వాయిదాపై అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటేనే పరీక్ష నిర్వహించడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. తమకు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, పదవులు కాదని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉంటేనే పరీక్ష నిర్వహించడానికి వీలవుతుందనే సబితా ఇంద్రారెడ్డి ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఎస్సీ రాత పరీక్షలు నిర్వంపజేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications