తిరగబడుతున్న చంద్రబాబు నాయుడి రెండు కళ్ల సిద్ధాంతం

తాజాగా, హైదరాబాదును ఆరో జోన్ పరిధిలోకి తేవడానికి రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధనను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభలో ప్రతిపాదించిన తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థించింది. ఎస్సై రాత పరీక్షలపై తెలంగాణలో ఆందోళన తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం నాయకులు హాజరై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయడంతో మళ్లీ చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. అందుకే, హైదరాబాదు ఫ్రీజోన్ అంశంపై మీడియా ప్రతినిధులు శనివారం విశాఖపట్నంలో ప్రశ్నిస్తే ఆయన రుసరుసలాడారు. పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం మాత్రమే సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. అసెంబ్లీ తీర్మానంపై ఓ టీవీ చానెల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు శ్రవణ్ వేసిన ప్రశ్నకు దేవినేని ఉమామహేశ్వర రావు సమాధానం చెప్పలేక ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రయత్నించారు. కె. ఎర్రంనాయుడు కూడా మాట వరుసకు మాట్లాడి ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications