సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్: విద్యార్థుల ఆందోళనలు

అనంతపురంలో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. ఎస్సై నియామకాలను వాయిదా వేయడాన్ని వారు తప్పుబట్టారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలో విద్యాసంస్థల బంద్ తో పాటు పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అనంతపురంలో రైల్వేస్టేషన్‌లో విద్యార్థిసంఘాలు రైల్‌రోకో కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఎస్సై నియామకాలను నిలిపివేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థులు నిరాహారదీక్షలను చేపట్టారు. ఎస్సై నియామకాలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications