ముఖ్యమంత్రి రోశయ్యపై విరుచుకుపడిన కె చంద్రశేఖర రావు

'హైదరాబాద్ 6వ జోన్ అని 8 నెలల కిందట అసెంబ్లీ తీర్మానం చేసింది..దానిపై చట్టం చేసేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లమని నేను స్వయంగా ముఖ్యమంత్రిని కలసి అడిగినా...సరే అన్నారు. తీసుకుపోరు...అదే పోలవరం సమస్య అయితే 30 మంది ఎంపీలను పంపుతారు. 20 మంది లాయర్లు, అధికారులు పోతారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళతాడు. అదే మన తెలంగాణ సమస్య అంటే కదలరు' అని కేసీఆర్ విమర్శించారు. 'సీమాంధ్ర నాయకులూ..రోశయ్య ఇంకా డ్రామాలు చేయాలంటే కుదరదు. తెలంగాణ ఉద్యమం పెద్దపులిలా పంజా విప్పి సాగుతోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా చూస్తం. ఆ తరువాత భూకంపం సృష్టించైనా సరే తెలంగాణ సాధిస్తాం. ఔర్ ఏక్ ఢక్కా తెలంగాణ పక్కా' అంటూ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వంలో వారికి ప్రాధాన్యం ఉన్న రెవెన్యూ, ఆర్థిక శాఖల్లాంటి నాలుగైదు మంత్రి పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications