వైయస్ జగన్ పై గుర్రుమన్న కాంగ్రెసు ఎంపి హనుమంతరావు
State
oi-Pratapreddy
By Pratap
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు మరోసారి చురకలంటించారు. వైయస్ జగన్ ను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసులోని కొంత మంది యువనాయకులు డబ్బు బలంతో పార్టీ అధిష్టానాన్ని కూడా వ్యతిరేకించేందుకు సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులు పోతే వారి శక్తి ఉడుగుతుందని, అప్పుడు వారేం చేయలేరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పార్టీకి 30 ఏళ్లు సేవ చేసిన తర్వాత తాను ఈ స్థితికి ఎదిగానని, ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న యువనేతలను కొద్ది దశాబ్దాలు ఆగాలని హైకమాండ్ చెబుతోందని, అది వినడానికి వారు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.