రాష్ట్రంలో చాలామంది హనుమంతరావులు ఉన్నారు: అంబటి

రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే ఇలాంటి చిన్న విషయాన్ని పట్టించుకొని రాద్దాంతం చేయటం తగునా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ఏది మాట్లాడినా తప్పు అనే దృష్టితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వైయస్ బతికుంటే ఇలాంటి కథనానికి ఆయన బాధపడే వారన్నారు. కానీ అదే సాక్షిపై 700 మంది పోలీసులు నిర్ధాక్షిణ్యంగా దాడిచేసి సోదాలు చేసినప్పుడు కాంగ్రెసు పార్టీ పత్రికలా కనిపించలేదా అని అడిగారు. ఒకప్పుడు ఓ పత్రికా యాజమాన్యానికి వత్తాసు పలికిన విహెచ్ కు సాక్షిపై మాట్లాడే అర్హత లేదన్నాడు. ప్రతిపక్షాలు విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ స్వపక్షం వారే విమర్శించినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి.
ఓ కాంగ్రెసు వర్గం వెళ్లి పాలాభిషేకం చేస్తుంటే శంకరరావు సాక్షి కార్యాలయం ముందుకు వచ్చి రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అనటం మీకే చెల్లుతుందన్నారు. మంత్రులు ఏం చేయలేకనే వీటిని ఖండిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య వారిని ఖండించాల్సిందిగా ఫోర్సు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దానం నాగేందర్, శంకరరావు తదితరులందరిపై అంబటి ధ్వజమెత్తారు. వైయస్ జగన్ కు తన పత్రిక ద్వారా చెప్పవలసిన అవసరం లేదన్నారు. ఆయన చెప్పాలనుకుంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పగల ధీరుడన్నారు. జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెసు ను బతికించే శక్తి కేవలం జగన్ కే ఉందన్నారు. 2014లో అధికారంలోకి తీసుకు వచ్చే శక్తి కూడా జగన్ కే ఉందన్నారు. అధిష్టానం పేరుతో కొందరు శాసించాలనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications