వైయస్ జగన్ ఎంపీ అనే విషయమే మరిచిపోయారు: బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

కాంగ్రెసు కు వ్యతిరేకంగా మిగిలిన వేరే పత్రికలు, టీవీలు ఇంతకంటే ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయని అక్కడ ధర్నా చేసి అడ్డుకోని వీరు సాక్షిని ఒక్కదానిని అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. మీడియాపై దాడులు భావ్యం కాదన్నారు. కాంగ్రెసు 125వ ఆవిర్భావ సంబరాల సందర్భంగా ఓ కథనాన్ని ప్రసారం చేస్తే అందులో ఎంత వరకు నిజం ఉందో ఆలోచించాలన్నారు. ఒకవేళ ప్రసారమైన దానిలో తప్పు ఉంటే ఖండించాలి. కాని ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు. ఆ కథనంలో నిజం ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలన్నారు. సాక్షి కథనానికి అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications