ప్రభుత్వం స్పందిస్తున్నా అసహనమేనా: మంత్రి ధర్మాన ప్రసాదరావు

Dharmana Prasad Rao
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తలపెట్టిన ఛలో హైదరాబాదును వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్టు లక్షల ఖాళీలు లేవని ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 60వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు‌ అధికారంలోకి వచ్చిన అనంతరం 1.74 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసామని ఆయన తెలిపారు. ఉద్యోగులకు 39 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 5,140 కోట్ల అదనపు భారం పడిందని ఆయనన్నారు.

విధాన పరమైన నిర్ణయాలను పిఆర్సీతో ముడిపెట్టడం ఉద్యోగసంఘాలకు సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వారి పట్ల తక్షణమే స్పందిస్తున్నా ఉద్యోగ సంఘాలు ఎందుకు అసహనంగా ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు ఆలోచించు మంగళవారం తలపెట్టిన ఛలో హైదరాబాదును విరమించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+