రాజకీయ దురుద్దేశాలతోనే సోనియాపై సాక్షి వార్తాకథనం: సిఎం రోశయ్య

"1988 తర్వాత ఇబ్బందుల్లో పడిన కాంగ్రెస్‌ను బలోపేతం చేసి 2004, 2009లో రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు సోనియా కృషి చేశారు. యూపీఏ అధ్యక్షురాలిగా ఆమె నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది. కీలకమైన పదవులను కాదని త్యాగశీలిగా పేరుగాంచిన సోనియా అధ్యక్షతన ప్రతి సభ్యుడు నిబద్ధతగా పనిచేస్తున్నారు. అలాంటి నాయకురాలి పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు, కథనాలు ప్రసారం చేయడం తగదు. ఈ కథనాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి" అని కోరారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన గొప్ప నాయకులు ఆమె నేతృత్వంలో యూపీఏ గొడుగు కింద పనిచేస్తున్నారని రోశయ్య గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications