2జిపై కుంభకోణంపై జెపిసి వేయాల్సిందే: భాజపా నేత వెంకయ్యనాయుడు
National
oi-Srinivas G
By Srinivas
నల్గొండ: కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాలలో మునిగిపోయిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆదర్శ్, 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు వంటి పలు కుంభకోణాలతో కాంగ్రెసు భ్రష్టుపట్టి పోయిందన్నారు. 2జిస్పెక్ట్రమ్ కుంభకోణంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీని ఏర్పాటుచేస్తేనే ప్రధానితో చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ రాజాను కాంగ్రెసు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటందన్నారు. ఆయనను తొలగించటంతోనే సరిపోదని, ఆయనపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూవివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.