యడ్యూరప్ప రాజీనామాకు బిజెపి అధిష్టానం డెడ్ లైన్

యడ్యూరప్ప పుట్టపర్తి సందర్శనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాను ఢిల్లీ వెళ్తానని, అధిష్టానానికి వివరణ ఇస్తానని యడ్యూరప్ప చెబుతున్నారు. అయితే పదవి నుంచి దిగడానికి మాత్రం ఆయన ఇష్టపడడం లేదు. అధిష్టానాన్ని ధిక్కరించే దిశలోనే ఆయన సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను గతంలో నిలబెట్టిన మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరులపై కూడా యడ్యూరప్ప మండిపడుతున్నారు. ఆదివారం యడ్యూరప్ప ఢిల్లీకి రాకపోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోంది. యడ్యూరప్ప పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారనే భావనతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications