దిగిపోవడానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప షరతులు

Yeddyurappa
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధిష్టానానికి షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులను మంత్రివర్గం నుంచి తొలగించాలని, తాను సూచించిన నాయకుడికే ముఖ్యమంత్రి పదవిలో నియమించాలని ఆయన షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. తన షరతులకు అంగీకరిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే ఆయన ఆ షరతులు పెడుతున్నట్లు సమాచారం.

కాగా, యడ్యూరప్ప సోమవారం ఉదయం సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి యడ్యూరప్ప పుట్టపర్తి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన జమ్మూకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు పార్టీ అధిష్టానం డెడ్ లైన్ పెట్టినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనకు అధిష్టానం డెడ్ లైన్ విధించలేదని ఆయన పుట్టపర్తిలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలుస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+