హైదరాబాదులో టెన్షన్ టెన్షన్: వెనక్కి తగ్గని ఉద్యోగ సంఘాలు

ఖమ్మం జిల్లాలో 100 మందిని, గుంటూరు, రేపల్లే, మాచర్ల, అద్దంకి,నల్గొండలలో పోలీసులు ఉద్యోగ సంఘాల నాయకులను ఎక్కడికక్కడే అర్ధరాత్రి అరెస్టు చేశారు. వరంగల్లో రాత్రికి రాత్రి ఉద్యోగులను అరెస్టు చేసి పోలీసులు తీసుకు వెళ్లడానికి నిరసనగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను మండల కేంద్రాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించినట్లు భావిస్తున్నారు. దీంతో హైదరాబాదులో అంతా టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఉద్యోగులు సామూహిక సెలవుల్లో ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద పోలీసులను భారీగానే మోహరించారు. ఎంతమంది పోలీసులను మోహరించిన తాము ర్యాలీ నిర్వహించి తీరుతామని ఉద్యోగసంఘాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications