సిగ్గు, లజ్జ ఉంటే జగన్ రాజీనామా చెయ్యాలి: పాల్వాయి

ఇంత రాద్దాంతం చేస్తూ తల్లిలాంటి కాంగ్రెసు పార్టీనే విమర్శిస్తున్న జగన్ కు కాంగ్రెసు పార్టీలో ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారన్నారు. ఆయన ఆస్తులన్నింటిపైన ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు. సాక్షిలో లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. అవన్నీ కాంగ్రెసు పార్టీ పేరుతో సమకూర్చుకున్నవేనన్నారు. ఆసలు జగన్ ఎవరు, ఆయన అడ్రస్ ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత్రి సోనియాగాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications