ఆంటోనీతో భేటీ: వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి రోశయ్య?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంపై రోశయ్య ఆంటోనీకి వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో వైయస్ జగన్ మాట్లాడిన విషయాలను, వైయస్ జగన్ అనుచర గణం చేసిన వ్యాఖ్యలను ఆయన ఆంటోనీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వైయస్ జగన్ వ్యవహారశైలిపై కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరే గళం విప్పుతున్నందు వల్ల రోశయ్య ఢిల్లీ యాత్ర ముఖ్యంగా జగన్ పై గురి పెట్టిందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications