జగన్ సోనియాకు వ్యతిరేకంగా ఎడిటోరియల్లో చెప్పలేదు: కొండా సురేఖ

జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరటంలో అర్థం లేదని ఆమె చెప్పింది. జగన్ తన నోటిద్వారా సోనియాను, కాంగ్రెసు ను విమర్శించలేదన్నారు. సాక్షిలో వచ్చిన కథనానికి జగన్ కు సంబంధం లేదన్నారు. జగన్ సాక్షిలో సంపాదకీయంలో కూడా చెప్పలేదని, ఒకవేళ సంపాదకీయంలో చెప్పినా తప్పుబట్టవచ్చు కానీ అలాంటివేమీ లేవన్నారు. సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటే రికార్డులు చూపించమని డిమాండ్ చేస్తామన్నారు. అవన్నీ లేనప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారన్నారు. సాక్షి కథనాలను జగన్ కు ఆపాదించటం సరికాదన్నారు. అయితే సాక్షి కథనాన్ని కార్యకర్తగా అందరూ ఖండించాల్సిందేనన్నారు.
పేపరు వేరు, టీవీ వేరు, వ్యక్తిగతం వేరని ఆమె చెప్పారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరితే పార్టీ సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వారిపై మొదట చర్యలు తీసుకోవాలని కోరుతామని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తన భుజాల మీద నిర్మించుకున్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశ్యం తమకుగానీ, జగన్ కుగానీ లేదని ఆమె చెప్పారు. ఆయన కూల్చాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications