సిఎల్పీలో ఎదురుదాడికి వైయస్ జగన్ క్యాంప్ రెడీ

విజయమ్మ కూడా హాజరై అవసరమైతే రాజీనామా చేయాలనే ప్రతిపాదన కూడా జగన్ వర్గం నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. గత రెండు మూడు రోజులుగా తన కుమారుడు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. అయితే, ఎదురు దాడి తప్పదని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశరావు మాటలను బట్టి అర్థమవుతోంది. వైయస్ జగన్ పై చర్చ జరిపేంత సాహసం సమావేశంలో చేయరని, చర్చ ప్రారంభమైతే ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసునని ఆయన అన్నారు. దీన్నిబట్టి సిఎల్పీ సమావేశం రసాభాసగా మారే అవకాశం కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications