మారిన వైయస్ జగన్ నిర్ణయం: హైదరాబాదుకు పయనం

తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్ జగన్ వర్గం తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పేరును ముఖ్యమంత్రి పదవికి వైయస్ జగన్ వర్గం ఆమోదిస్తుందా, లేదా అనేది చూడాల్సి ఉంది. వైయస్ జగన్ తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. కొత్త సిఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ తీర్మానం చేయాలనే అధిష్టానం పరిశీలకుల ఎత్తుగడలను వైయస్ జగన్ ఎలా తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications