57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాబట్టి కిరణ్ కుమార్ కు సిఎం పదవి

పార్టీ పరిరక్షణ కోసం మేం తెలంగాణ నినాదం ఎత్తుకోక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీలు పని చేయకుంటే ఏ పార్టీకుడా మనజాలదని ఆయన అన్నారు. తెలంగాణ నినాదం మే ఎత్తుకోకంటే ఇతర పార్టీలు దానిని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశముందన్నారు. మంత్రి పదవులు తీసుకుంటే తెలంగాణ రాదని తెలంగాణకు చెందిన విద్యార్థులు భయపడుతున్నారని అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. పోలవరం పై మాకేమీ అభ్యంతరం లేదని అయితే ఆ ప్రాజెక్టుపై మాకున్న భయాలు, అనుమానాలు తొలగిస్తే సరిపోతుందన్నారు.
మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమాన ప్రాదాన్యం ఇవ్వాలని విహెచ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటూ రాష్ట్రంలో అందరికి సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమ ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, ఎమ్మెల్యేలు నిరాశకు లోనవుతారని అన్నారు. 57 మంది శాసనసభ్యులు ఆ సామాజిక వర్గానికి ఉన్నారు కాబట్టి కిరణ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఉంటారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, తెలంగాణ వంటి అతిసున్నిత సమస్యలు ఉన్నాయని విహెచ్ ఆయనకు సూచించారు.












Click it and Unblock the Notifications