వైయస్ జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖకు మంత్రి పదవి ఆఫర్

Konda Surekha
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గాన్ని చేరదీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత అందుకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. జగన్ వర్గానికి మంత్రి పదవులను ఆశ చూపుతోంది. ఇప్పటికే జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి అధిష్టానం ఆఫర్ కు అంగీకరించినట్లు సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి అధిష్టానం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి కొండా సురేఖను చేర్చుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న బలమైన నాయకులను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని పార్టీ అధిష్టానం అమలు చేస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+