తెర మీదికి సూరీడు: వైయస్ జగన్ ను కార్నర్ చేసేందుకు కిరణ్ ప్లాన్

కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సూరీడిని పిలిపించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ను దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగానే సూరీడిని కిరణ్ కుమార్ రెడ్డి తెర మీదికి తెచ్చినట్లు భావిస్తున్నారు. వైయస్సార్, వైయస్ జగన్ ల రహస్యాలన్నీ సూరీడికి తెలుసు. వాటిని సూరీడి నుంచి రాబట్టేందుకు కిరణ్ కుమార్ ఆ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు సంబంధించిన విషయాలు తెలిస్తే ఆయనను కార్నర్ చేయడం సులభమవుతుందనేది కిరణ్ కుమార్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications