కనిపించని వీరప్ప మొయిలీ: వైయస్ జగన్ క్యాంప్ నో చాన్స్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలందరినీ కలుస్తున్నారు. కానీ మొయిలీ ఊసు మాత్రం రావడం లేదు. వ్యవహారాలన్ని ఆజాద్ చేతిలో వెళ్లాయని గుర్తించిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ వీరాభిమానులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అనవసరమైన గందరగోళం సృష్టిస్తారనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అధిష్టానం ఇష్టంగా లేదు.












Click it and Unblock the Notifications