బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి వర్సెస్ అబ్బాయ్ వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల్లో సమరాన్ని బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ గా మార్చడంలో పార్టీ అధిష్టానం విజయం సాధించినట్లే. మంత్రి పదవి కోసం ఢిల్లీకి పిలిపించి వైయస్ వివేకానంద రెడ్డిని జగన్ కు దూరం చేయడంలో ఫలితం సాధించింది. సాక్షి కథనాలపై వైయస్ జగన్ తో సోనియాకు క్షమాపణ చెప్పిస్తానని వివేకానందరెడ్డి ఢిల్లీ చెప్పిన మాటతో వైయస్ జగన్ వర్గం భగ్గుమంది. జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు వైయస్ వివేకానంద రెడ్డిపైనా, పార్టీ అధిష్టానంపైనా భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం జగన్ కు లేదని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానమే తప్పు చేసిందని విమర్శించారు. వైయస్ వివేకానంద రెడ్డి మంత్రి పదవి కోసం పైరవీలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, వైయస్ జగన్ ను కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.

వైయస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టి వైయస్ జగన్ ను ఏకాకి చేయడానికి పార్టీ అధిష్టానం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ను ఏకాకి చేయాలనే కుట్రలో వివేకానంద రెడ్డి ఇరుక్కుపోయారని ఆయన విమర్సించారు. దుష్టశుక్తుల పన్నాగాలకు వివేకానంద రెడ్డి ఉపయోగపడుతున్నారని వ్యాఖ్యానించారు. వైయస్ వివేకానంద రెడ్డి అలా చేయడం డబ్బు కోసమా, పదవి కోసమా, ఇతరత్రా కారణాల కోసమా అనేది త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పాల్సనంత తప్పు వైయస్ జగన్ ఏమీ చేయలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ తప్పు చేస్తే షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+