వైయస్ జగన్ రాజీనామాను తేలిగ్గా తీసుకున్న కాంగ్రెసు అధిష్టానం

వైయస్ జగన్ రాజీనామాను మరో ఎఐసిసి నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా తేలిగ్గా తీసుకున్నారు. దీన్ని బట్టి పార్టీ అధిష్టానం కోరుకున్నదే జగన్ చేసినట్లు కనిపిస్తోంది. తనంత తానుగా వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేయాలని కాంగ్రెసు అధిష్టానం చాలా కాలంగా వ్యవహరిస్తూ వస్తోంది. అందుకు అనుగుణంగా వ్యవహరించింది. దీంతో వైయస్ జగన్ పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా వైయస్ జగన్ రాజీనామా వ్యవహారాన్ని తేలిగ్గానే తీసుకున్నట్లు కనిపించారు. జగన్ రాజీనామా వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications