వైయస్ జగన్ బలం ఎంత: కాంగ్రెసు అధిష్టానం అంచనా

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బలంపై కాంగ్రెసు అధిష్టానం స్పష్టమైన అంచనాతో ఉన్నట్లు సమాచారం. వైయస్ జగన్ వెంట పది నుంచి పదిహేను మంది శాసనసభ్యులు మాత్రమే ఉంటారని అంచనాకు వచ్చింది. వారిలో కూడా కొంత మంది వెనక్కి తగ్గవచ్చునని అనుకుంటోంది. ఇప్పటికే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో పార్టీ అధిష్టానం సన్నిహితులు మాట్లాడారు. ఇటీవల హైదరాబాదులో వైయస్ జగన్ సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు 18 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. మరో ఇద్దరు మాజీ మంత్రులున్నారు. అంతకు మించి వైయస్ జగన్ బలం పెరిగే అవకాశం లేదని అనుకుంటున్నారు.

కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ముందుకు వచ్చారు. తాను సోనియా వెంటే ఉంటానని స్పష్టం చేశారు. దీన్ని బట్టి అసలు బలప్రదర్శన వచ్చే సరికి వైయస్ జగన్ కు మద్దతిచ్చే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని చేరదీయడం ద్వారా చాలా వరకు వైయస్ జగన్ లాబీని దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. అయితే, శాసనసభ్యులతో పని లేదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు వంటి వారు అంటున్నారు. ఒక వేళ, కొద్ది మంది శాసనసభ్యులు వైయస్ జగన్ కు మద్దతుగా ప్రభుత్వాన్ని పడగొట్ట దలుచుకున్నా జరిగే పని కాదని భావిస్తున్నారు. కర్ణాటక అనుభవం ద్వారా విప్ ను జారీ చేసి, అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. పైగా, ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో కాంగ్రెసు పొత్తును ఖరారు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+